![]() |
![]() |
.webp)
అఖిల్ సార్థక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా అందరికీ తెలిసిన యాంకర్ , యాక్టర్ కూడా. అంత పెద్ద ఫేమ్ లేకపోయినా కానీ బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అలాంటి అఖిల్ రీసెంట్ గా వాళ్ళ పేరెంట్స్ కి 42 వ వివాహ మహోత్సవ కార్యక్రమానికి ఒక సర్ప్రైజ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక దాన్ని చూసి వాళ్ళ అమ్మైతే ఫుల్ ఫిదా ఐపోయింది. ఆ గిఫ్ట్ మరేదో కాదు. నిలువెత్తు శ్రీవారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వాళ్లకు బహుమతిగా ఇచ్చాడు. ఇక వాళ్ళ అమ్మ ఆ సడెన్ సర్ప్రైజ్ గా వచ్చిన గిఫ్ట్ ని చూసి అసలు ఏముందా అందులో అంది ఆశ్చర్యపోతూ గిఫ్ట్ ప్యాక్ ని ఓపెన్ చేసి చివరికి షాకయ్యింది.
వేంకటేశ్వరుడి నిలువెత్తు విగ్రహం చూసేసరికి వాళ్ళ నాన్న దండాలు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఇక వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా అఖిల్ పేరెంట్స్ ని విష్ చేసాడు. కేక్ కట్ చేయించి తినిపించాడు. ఇక ఆ వేంకటేశ్వరుడి పక్కన వాళ్ళ పేరెంట్స్ ని అటు ఇటు నిలబెట్టి పిక్స్ తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. ఇక అఖిల్ రీసెంట్ గా వేరే లెవెల్ ఆఫీస్ అనే ఓటిటి మూవీలో నటించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మోనాల్ గుజ్జర్ తో ఎక్కువగా ఫ్రెండ్ షిప్ చేసేవాడు. ఆమె మాత్రం అభిజిత్ తో ఎక్కువగా మాట్లాడేది. అది అఖిల్ కి ఎక్కువగా నచ్చేది కాదు. కానీ తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చాక ఎవరి దారులు వారివి వేరైపోయాయి. అఖిల్ ఎక్కువగా టెంపుల్స్ ని సందర్శించడం అలాగే జిమ్ లో ఎక్కువగా ఉండడం చేస్తూ ఉన్నాడు. ఆ పిక్స్ ని, వీడియోస్ ని ఎక్కువగా తన ఇన్స్టాగ్రామ్ లో చేస్తూ ఉంటాడు.
![]() |
![]() |